Transformer | రాయపోల్ జూన్ 27 : ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. అంటూ రాయపోల్ మండల కేంద్రానికి సంబంధించి నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్లో వచ్చిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
గద్దెపై పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ లేక అలంకారప్రాయంగా ఉందని.. దీంతో లో ఓల్టేజీ సమస్య ఏర్పడిందని విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వాలని నమస్తే తెలంగాణ వెబ్ న్యూస్ (www.ntnews.com)లో ఈ నెల 24న ప్రచురితమైన వార్తా కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు.
విద్యుత్ శాఖ అధికారులు గురువారం హుటాహుటిన పిచ్చి మొక్కల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను పరిశుభ్రం చేసి ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా కాలనీలోని విద్యుత్ స్తంభాలలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Transformer | ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. ముళ్ల పొదల్లో ఇలా