నీళ్లిచ్చి పంటలు కాపాడాలి
కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,అంకిరెడ్డిపల్లి, పెద్దఅరెపల్లి రైతులు రోడ్డు పై బైఠాయించారు.
- పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన
- సిద్దిపేట జిల్లా రామాయంపేట కెనాల్ ద్వారా సాగు నీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో
రాయపోల్,మార్చి 11 : కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,అంకిరెడ్డిపల్లి, పెద్దఅరెపల్లి రైతులు రోడ్డు పై బైఠాయించారు. రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు నింపటానికి కాల్వల ఉన్నప్పటికీ నీళ్లు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని, రామాయంపేట కెనాల్ ద్వారా చెరువులు నింపి పంటలను కాపాడాలన్నారు. కొండపోచమ్మ ప్రాజ్టెక్టు ఉన్నా గ్రామాల చెరువుల్లోకి సాగునీళ్లు ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసినప్పటికీ చెరువుల్లో నీరులేక పొలాలు ఎండిపోయే దశకు వచ్చాయన్నారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న రాయపోల్ ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి రైతులను సముదాయించారు. ఎస్సై మానస సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సాగు నీళ్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Crops
- Drying Crops
- farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

