బంజారాహిల్స్, మార్చి 11: వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అనర్హత పిటిషన్పై బుధవారం స్పీకర్ నిర్ణయం ప్రకటించడానికి అరగంట ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీనుంచే గత ఎన్నికల్లో గెలిచానని, పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదన్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానన్నారు. కాగా దానం నాగేందర్ మీద పార్టీ ఫిరాయింపు చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డివ వేసిన పిటిషన్ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదనంతరం డిస్మిస్ చేశారు.