CMRF | రాయపోల్, మే 28 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో వరం లాంటిదని దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సరువువారి యాదవ రెడ్డి అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జనగామ బూదయ్యకు రూ. లక్ష 75 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న ప్రతీ ఒక్కరూ సీఎం సహాయ నిధి ద్వారా మళ్లీ డబ్బులు పొందే అవకాశం ఉందని వైద్యం చేయించుకున్న నిరుపేదలు సీఎం సహాయనిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డిల సహకారంతో ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, దౌల్తాబాద్ వికలాంగుల అధ్యక్షుడు నర్సింహులు, లక్ష్మీనారాయణ, గడ్డం లక్ష్మీనారాయణ, బోటుక సత్తయ్య, రమేష్, ప్రభాకర్, భాస్కర్, వెంకటయ్య సురేందర్, నాగయ్య పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు