Congress Govt Frauds | చేర్యాల, జూలై 9 : అధికారం కోసం 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను గడగడపకు బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం కోరారు.
స్ధానిక సంస్ధల సన్నాహాక సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని కొత్త దొమ్మాట, దొమ్మాట, గుర్జకుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పని చేయాలన్నారు.
ఐక్యంగా లేకపోతే అధికార పార్టీకి లాభం..
కార్యకర్తలు అభ్యర్ధుల విజయం కోసం సైనికుల వలే పని చేయాలని, ఐక్యంగా లేకపోతే అధికార పార్టీకి లాభం చేకూరుతుందన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని, ఒకే తాటిపై నిలబడి అధికార పార్టీ అభ్యర్ధులను ఓడించడమే లక్ష్యంగా ముందుకుసాగాలన్నారు.
ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ చేర్యాల టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, యూత్ ఇన్చార్జీ శివగారి అంజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్, బొమ్మగాని బాలరాజు, చంద్రం, మాజీ సర్పంచులు మమత రాంరెడ్డి, సొంటి రెక్కల భిక్షపతి, మాజీ ఎంపీటీసీ ముచ్చెంతల చుక్కారెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు ఆకుల రాజేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి తాండ్ర సాగర్, బీరెడ్డి ఇన్నారెడ్డి, బూరగోని తిరుపతిగౌడ్, ఎర్రోల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం