Suicide | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భవాని కాలనీలోని శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రితిక అనే యువతి కాలేజీ భవనం మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది.
విద్యార్థిని రితిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. రితిక ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతుంది. కాగా రితిక ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడిందనే కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.