మునుగోడు, ఫిబ్రవరి 19 : మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి, టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు. చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. చత్రపతి శివాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి చెన్నారెడ్డి, పాలకూరి నరసింహ గౌడ్, వేదాంతం గోపీనాథ్, బొడ్డు నాగరాజు గౌడ్, అనంత లింగస్వామి, మాదగోని నరేందర్ గౌడ్, బొమ్మిడికాయల సాయి, పోలే రాజు, బి.కళ్యాణ్, నీరుడు రవివర్మ, వేముల సాయి, హిందు వాహిని కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.