Collector Rahul raj | తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణపై దృష్టి సారించి దేశంలోనే మన రాష్టం మొదటి స్థానంలో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. హవేలీ ఘనపూర్ రైతు వేదికలో ఆయిల్ పామ్ పంట విస్తరణ పథకం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం కేటాయించగా, ఉద్యాన శాఖలో అధికారుల కొరత ఉన్నందున, గత 15 రోజుల క్రితం ప్రతీ ఏఈవో వారీగా 30 ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగింది.
తదనుగుణంగా ఇప్పటివరకు గుర్తించిన రైతులు వివరాలను, తదుపరి కార్యాచరణ గురించి సమీక్షించారు. జిల్లాలో 2023-24 సంవత్సరంలో 78 మంది రైతులు 336 ఎకరాలలో, 2024-25 సంవత్సరంలో 152 రైతులతో 533 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం మెదక్ జిల్లాకు 2500 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటల సాగు చేయుటకు ప్రణాళికా చేసుకోవడం జరిగినది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర వర్గాల రైతులకు 80 శాతం చొప్పున రాయితీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. నాటిన 4 ఏట నుంచి 30 ఏళ్ల వరకూ రైతులకు ఆయిల్ పామ్ తోటల ఫలసాయం అందుతుందన్నారు
ప్రభుత్వం తరుపున రాయితీలు ఎకరాకు రూ.50,918/- చొప్పున అందిస్తున్నది. జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పెంచుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టి అధిక దిగుబడి లాభం పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన జాయింట్ డైరెక్టర్ సునీత, జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ ,మెదక్ ఉప సంచాలకులు విజయ నిర్మల, నర్సాపూర్ వ్యవసాయ ఉప సంచాలకులు సంధ్యా రాణి, కౌడిపల్లి ఉప సంచాలకులు, లివ్ పామ్ రిసోర్సెస్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు ,పామ్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ కృష్ణ,మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, తదితరులున్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య