MLA Palla Rajeshwar Reddy | చేర్యాల, మార్చి 26 : చేర్యాల ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి ప్రస్తావించారు. చేర్యాల మండలంలోని నాగపురి, శబాష్‌గూడెం, వేచరేణి, పెదరాజుపేట తదితర గ్రామాలకు కొమురవెల్లి మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోకి మార్చారని.. వాస్తవంగా నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర ప్రభుత్వశాఖల అధికారుల కోసం చేర్యాలకు వస్తుంటారన్నారు.
పోలీస్‌స్టేషన్ సమస్యలపై ఆయా గ్రామాల ప్రజలు కొమురవెల్లి పీఎస్‌కు వెళ్లాల్సి వస్తున్నదని వెంటనే నాలుగు గ్రామాలను చేర్యాల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.ఇప్పటికే మద్దూరు మండలం నుంచి చేర్యాల మండలానికి అర్జునపట్ల, కమలాయపల్లి గ్రామాలను ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడి చేర్యాలకు బదిలీ చేయించారు.
నిత్యం చేర్యాల ప్రాంత సమస్యల పై అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గళమెత్తుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి