ACB Raids : పాఠశాల స్థాయిలో విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్‌పై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరూ అవినీతి నిరోధక అధికారులకు దొరికారు. ఏసీబీకి అధికారులకు పట్టుబడిన వారిలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ ఎస్ ఫణిరాజ్, రంగారెడ్డి డీఈవో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ఉన్నారు.
ఎన్వోసీ ఇచ్చేందుకు ఫణిరాజ్, జి.శ్రీధర్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓ సీబీఎస్ఈ పాఠశాలకు ఎన్ఎసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకుగానూ రూ.70 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి వారిని పట్టుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.