Kubhir | జాతరలో అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు..!
కుభీర్, ఫిబ్రవరి 19: కుభీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో గత ఐదు రోజులుగా కొనసాగిన జాతర వేడుకలు కుస్తీ పోటీలు, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి.
కుభీర్, ఫిబ్రవరి 19: కుభీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో గత ఐదు రోజులుగా కొనసాగిన జాతర వేడుకలు కుస్తీ పోటీలు, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్ రాష్ట్ర కుస్తీ పోటీలు ఆహుతులను అలరించాయి. కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన ఈ పోటీలు చివరగా రూ.10 వేల కుస్తీతో ముగిశాయి. ఈ సదర్భంగా మల్లయోధులను ఆహుతులు చప్పట్లతోపాటు కేరింతలు, ఈలలు వేస్తూ వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని కల్పించారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు రాత్రి 7 గంటలకు ముగిశాయి. ఈ పోటీల్లో మహారాష్ట్రలోని హిమాయత్ నగర్ నాందేడ్ కన్వర్ట్ తదితర ప్రాంతాల మల్లయోధులు తలపడ్డారు. కుస్తీ పోటీల్లో విజేతలైన మల్లయోధులను భుజాన ఎత్తుకొని ప్రాంగణమంతా కలియ తిరిగారు. కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వీ మోహన్, స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, నిర్మల్ జిల్లా లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

