AFG vs CAN : టీ20 ప్రపంచకప్ టోర్నీకి అఫ్గనిస్థాన్ విజయంతో వీడ్కోలు పలికింది. చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాపై కాబూలీ టీమ్ భారీ విజయం సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జిద్రాన్(95) అర్ధ శతకంతో చెలరేగగా.. మొహమ్మద్ నబీ(4-7) బంతితో తిప్పేశాడు. పవర్ ప్లేలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన కెనడా ఓటమిని తప్పించుకోలేకపోయింది. హర్ష్ థాకరే(30), సాద్ బన్ జఫర్(28)లు ధనాధన్ ఆడి పరుగుల అంతరం తగ్గించారు. ప్రత్యర్థిని 118కే కట్టడి చేసిన రషీద్ సేన 82 రన్స్ తేడాతో విజయదుందుభి మోగించింది.
గత సీజన్లో సెమీస్ ఆడిన అఫ్గనిస్థాన్ ఓదార్పు విజయంతో ఈసారి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుసగా రెండు ఓటములతో సూపర్ 8 అవకాశం చేజార్చుకున్న కాబూలీ టీమ్.. వరుసగా రెండు విజయాలతో వరల్డ్‌కప్‌ను ముగించింది. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(95) ఆకాశమే హద్గుగా చెలరేగగా.. సెడీకుల్లా అటల్(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కొండంత ఛేదనలో కెనడా ఆరంభంలోనే తడబడింది.
Semi-finalists at the last edition, Afghanistan end the 2026 T20 World Cup with two wins 🇦🇫 pic.twitter.com/ye1dwnKxvl
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
భారీ ఛేదనలో అఫ్గన్ బౌలర్ల ధాటికి 33కే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకునేందుకు ఒక్కరూ నిలబడలేదు. న్యూజిలాండ్‌పై సెంచరీతో విరుచుకుపడిన ఓపెనర్ యువరాజ్ సమ్రా(17) నిరాశపరచగా.. మొహమ్మద్ నబీ(4-7) స్పిన్‌తో పడగొట్టాడు. ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వడంతో 48కే ఐదు వికెట్లు పడిన వేళ హర్ష్ థాకరే(30), సాద్ బిన్ జఫర్(28)లు బ్యాట్ ఝులిపించి స్కోర్ వంద దాటించారు. అఫ్గన్ స్పిన్నర్లు బాగా కట్టడి చేయడంతో కెనడా 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిందంతే.