Junk Foods | ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..!
జంక్‌ఫుడ్, అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ తినడానికి చాలా సౌకర్యంగా, రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వీటిని తినే వారి సంఖ్య ఎక్కువయ్యింది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ఆహారాలు ఆరోగ్యంపై నిశ్శబ్దంగా ప్రభావాన్ని చూపిస్తాయని మీకు తెలుసా.
Junk Foods | జంక్‌ఫుడ్, అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్స్ తినడానికి చాలా సౌకర్యంగా, రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వీటిని తినే వారి సంఖ్య ఎక్కువయ్యింది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ఆహారాలు ఆరోగ్యంపై నిశ్శబ్దంగా ప్రభావాన్ని చూపిస్తాయని మీకు తెలుసా. ఈ ఆహారాల్లో చక్కెరలు, ఉప్పు, ఫ్రిజర్వేటివ్స్, అనారోగ్య కొవ్వులు అనేకం ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలక్రమేణా శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. కనుక ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలనుకునే వారు వీటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా నాలుగు ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
ప్రాసెస్ చేయబడిన ఆహారాలు..
చక్కటి జీవనశైలిని పాటించాలనుకునే వారు, చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి అనుకునే వారు ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. సాసేజ్ లు, సలామీలు, హాట్ డాగ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో ప్రేగులకు హానిని కలిగించే ఫ్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్ ను, శీతల పానీయాలను, చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నమ్కీన్లు, చిప్స్, భుజియా సేవ్ వంటి అధిక ఉప్పు కలిగిన స్నాక్స్ ను తీసుకోకూడదు. వీటిని శుద్ది చేసిన నూనెలతో తయారు చేస్తారు. అలాగే వీటిలో ఉప్పు కూడా అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
కుక్కీస్, స్వీట్లు..
అలాగే కుక్కీస్, స్వీట్ బాక్స్, గమ్మీలు వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. వీటిలో కృత్రిమ రంగులతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి నిశ్శబ్దంగా హానిని కలిగిస్తాయి. ఇటువంటి ఆహారాలు నెమ్మదిగా మన శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక వీటిని తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి ఆహారాలు మన శరీరానికి హానిని కలిగిస్తాయి. కానీ వీటిని తినాలనే బలమైన కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే తయారు చేసిన ఏవైనా చిరుతిళ్లను కొద్దిగా తినవచ్చు. లేదా గింజలు, పండ్లు వంటి ఆహారాలను తీసుకోవచ్చు. దీంతో జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇలా పాటిస్తే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Junk foods
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

