MLA Kotha Prabhakar Reddy | చేగుంట, మార్చి24: నార్సింగి మండలంలో ఉన్న భీంరావ్పల్లిని చేగుంట మండలంలో,చేగుంట మండలంలో ఉన్న వల్భాపూర్ను నార్సింగి మండలంలో కలుపాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. గతంలో ఉమ్మడి చేగుంట మండలంలో నార్సింగి గ్రామ పంచాయతీకి వల్భాపూర్ గ్రామం ఆమ్లెట్‌గా ఉండేది.
నార్సింగిలో కలుసుకోని ఉన్న వల్భాపూర్ ప్రస్తుతం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మండలాల పునర్విభజనలో భాగంగా నార్సింగి ప్రత్యేక మండలం ఏర్పాటు అయినప్పటికీ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగుంట మండలంలో ఉంది. చేగుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంరాపల్లి గ్రామం నార్సింగి మండలంలో కోనసాగడంతో ప్రజలకు,పాలనకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇట్టి విషయమై పలుమార్లు ఇరు గ్రామాల ప్రజలు మార్పు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి సమర్పించారు. టెక్నికల్ సమస్యల వల్ల మారడంలేదని రెండు గ్రామాల ప్రజలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడంతో భీంరావ్పల్లి,వల్భాపూర్ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also |
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?