Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యం గత కొన్ని రోజులుగా తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది.
Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యం గత కొన్ని రోజులుగా తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. గత వారం జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. దంతెవాడ (Dantewada) జిల్లాలో భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
దంతెవాడ – బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి నక్సలైట్ల మృతదేహాలతోపాటు తుపాకీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
కాగా, ఈనెల 20వ తేదీన తుపాకుల మోతతో దండకారణ్యం రక్తసిక్తమైన విషయం తెలిసిందే. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా పీడియా అడవుల్లో గురువారం ఉదయం నక్సల్స్, పోలీస్ వర్గాల మధ్య సుమారు నాలుగు గంటలపాటు భీకర పోరు సాగింది. ఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు కోరోస్కోడో గ్రామ సమీప అడవుల్లో జరిగిన మరో ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు.
Also Read..
Mamata Banerjee | లండన్ పార్క్‌లో చీర, రబ్బరు చెప్పులతో దీదీ జాగింగ్.. వీడియో వైరల్
Canada | మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం.. న్యూ ఢిల్లీపై మరోసారి నోరుపారేసుకున్న కెనడా
AC Helmets | మండుటెండల్లో విధులు.. ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

