Mamata Banerjee | రాజకీయాల్లోనే కాదు, రోజువారీ కార్యక్రమాల్లోనూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banejee) అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తన రోజూవారి దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించే దీదీ.. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా ఇదే అలవాటును అనుసరిస్తుంటారు. ప్రస్తుతం లండన్ పర్యటనకు వెళ్లిన బెంగాల్ సీఎం.. అక్కడ పార్క్‌లో తన బృందంతో కలిసి జాగింగ్ చేశారు.
লন্ডন। সকাল। মুখ্যমন্ত্রী বললেন,’ ওয়াক নয়, ওয়ার্ম আপ। হাইড পার্কের ভিডিও।’ একটু পরে হাইকমিশনে যাওয়া। pic.twitter.com/do6JsmeHtO
— Kunal Ghosh (@KunalGhoshAgain) March 24, 2025
స్థానిక హైడ్ పార్క్ (London Hyde Park)లో చీర, రబ్బరు చెప్పులతో (Saree Slippers) తన ఉదయపు నడకకను ప్రారంభించి జాగింగ్ చేశారు. భద్రతా సిబ్బంది వెంట రాగా మమత జాగింగ్ చేస్తున్న వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ తన అధికారిక ఎక్స్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Back walk. হাইড পার্ক। pic.twitter.com/4wkYU6ySQu
— Kunal Ghosh (@KunalGhoshAgain) March 24, 2025
మమతా బెనర్జీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ.. ఆయా సందర్భాల్లో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తుంటారు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు దీదీ ఇలా జాగింగ్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో స్పెయిన్, డార్జిలింగ్ తదితర దేశాలకు వెళ్లినప్పుడు ఉదయం ఇలానే చీర, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.
Bengal and Britain share a relationship that spans centuries, rooted in history, culture, and commerce. As we landed in London yesterday, we stepped into a city that, much like Kolkata, carries the weight of its past while embracing the dynamism of the present.
Before the day’s… pic.twitter.com/xNx4tZ0crl
— Mamata Banerjee (@MamataOfficial) March 24, 2025
Also Read..
Canada | మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం.. న్యూ ఢిల్లీపై మరోసారి నోరుపారేసుకున్న కెనడా
Earthquake | న్యూజిలాండ్‌ను వణికించిన భారీ భూకంపం
Rice Husk | తవుడును అంత తేలిగ్గా తీసిపారేయవద్దు.. ఎన్నో పోషకాలకు నెలవు ఇది..!