Earthquake | న్యూజిలాండ్ (New Zealand)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. సౌత్ ఐలాండ్ (South Island) పశ్చిమ తీరంలో మంగళవారం ఉదయం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7.15 గంటల ప్రాంతంలో న్యూజిలాండ్ పశ్చిమ నైరుతి తీర ప్రాంత పట్టణం రివర్టన్ (Riverton coast) సమీపంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు.
అయితే, భూకంపం తీవ్రత 6.5 నుంచి 6.8 మధ్య ఉండే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. సౌత్ ఐలాండ్ నైరుతి నుంచి 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో సంభవించినట్లు వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండటంతో నష్టం సంభవించి ఉంటుందని స్థానిక మీడియా భావిస్తోంది. ఇక ఇప్పటివరకూ ఈ ప్రాంతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Self Cooling Can | సెల్ఫ్-కూలింగ్ క్యాన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిల్!
Grok | ‘గ్రోక్’ ఎలా పనిచేస్తుందంటే?
America | అమెరికా అందాలను వీక్షించాలని కలలు కంటున్నారా?.. అయితే జర ఆగండి!