Bangladesh | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. అక్కడ త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో షేక్ హసీనా (Sheikh Hasina) బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆయన సారథ్యంపై తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. యూనస్‌ను తొలగించి సైన్యం నియంత్రణ చేపట్టే అవకాశం ఉందని మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలోని సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో జరిగే ప్రధాన పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం లేదా యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సైన్యం తన పర్యవేక్షణలో జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
Canada | మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం.. న్యూ ఢిల్లీపై మరోసారి నోరుపారేసుకున్న కెనడా
Earthquake | న్యూజిలాండ్‌ను వణికించిన భారీ భూకంపం
Self Cooling Can | సెల్ఫ్-కూలింగ్ క్యాన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిల్!