MLA kotha prabhakar reddy | తొగుట : తొగుట మండలంలోని కాన్గల్కు చెందిన మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి మాతృమూర్తి అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాన్గల్‌లో అనసూయమ్మ దశ దిన ఖర్మలో పాల్గొని ఆమె చిత్ర పటానికి నివాళిలు అర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను పరామర్శించారు.
అనంతరం ఘనపూర్‌లో ఇటీవల మరణించిన పుల్లగూర్ల భాగ్యమ్మ, కుంభాల ఇస్తారమ్మ, మరుపల్లి నరేష్ గౌడ్ కుటుంబాలను వారు పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కొమ్ము కిషన్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి,బాణపురం కృష్ణారెడ్డి, నామిలే భాస్కరా చారి, ఆస యాదగిరి, దోమల కొమురయ్య, బోధనం కనకయ్య, వేల్పుల స్వామి, కొమ్ము శరత్, రాజిరెడ్డి, వెంకట్ రెడ్డి, కొమ్ము రాజశేఖర్, తగరం అశోక్, మంగ నర్సింలు, యాదగిరి, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాను, శ్రీనివాస్, బాలయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం