న్యూఢిల్లీ: వ్యూహాత్మకమైన యూనిట్లకు సైబర్‌దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేసే అత్యాధునిక అరుణిక సూపర్‌కంప్యూటర్(Arunika supercomputer)కు చట్టపరమైన ప్రొటెక్షన్ ట్యాగ్ లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యాధునిక, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సూపర్‌కంప్యూటర్ అరుణికను 2024 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఈ సూపర్‌కంప్యూటర్ అంచనా వేస్తుంది. కీలకమైన సైంటిఫిక్ కేంద్రాలకు సైబర్‌భద్రత కల్పించే ఉద్దేశంతో చర్యలు చేపట్టినట్లు భూశాస్త్ర మంత్రిత్వ కార్యాలయం పేర్కొన్నది.
నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కు చెందిన అరుణిక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌కు రక్షణ కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. 2000 నాటి ఐటీ చట్టంలోని సెక్షన్ 70(1) కింద అరుణిక కంప్యూటర్‌కు ప్రొటెక్షన్ ట్యాగ్ దక్కినట్లు ప్రభుత్వం వెల్లడించింది. చట్టపరమైన రక్షణ వల్ల ఆ సూపర్‌కంప్యూటర్‌కు మరింత అదనపు భద్రత లభిస్తుంది. సున్నితమైన వాతావరణశాఖ డేటాను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు. ఒకవేళ ఎవరైనా ఆ కంప్యూటర్ను యాక్సెస్ చేసినా, లేక డేటాను చోరీ చేసే ప్రయత్నం చేసినా వారికి చట్టపరమైన శిక్ష ఉంటుంది.
వాతావరణం, విపత్తులకు చెందిన వార్నింగ్‌ను అరుణిక హెచ్పీసీ సిస్టమ్ జారీ చేస్తుంది. వ్యవసాయం, వైమానికం, సముద్ర, విపత్తు సంబంధిత అంశాలకు అరుణికం కీలకం కానున్నది. కేవలం ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెందినవారు మాత్రమే అరుణిక సిస్టమ్‌ను యాక్సెస్ చేస్తారు. అరుణిక కంప్యూటర్ సిస్టమ్ నోయిడాలో ఉన్నది. వెదర్ అక్యూరెసీని అంచనా వేస్తుంది. 8.24పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో దీన్ని ఆపరేట్ చేస్తారు.