స్నేహం కోసం
స్నేహితుల దినోత్సవం రోజున స్నేహానికి అసలైన నిర్వచనం ఇచ్చారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తారు.
స్నేహితుల దినోత్సవం రోజున స్నేహానికి అసలైన నిర్వచనం ఇచ్చారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తన ప్రాణ స్నేహితుల్ని భాగస్వాముల్ని చేశారు బన్నీ. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ అనుంగు మిత్రుడైన బన్నీ వాస్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
అలాగే బన్నీ ప్రాణమిత్రులైన సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి కూడా ఈ సినిమాలో భాగస్తులు కానున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం, కలిసి ఆనందాల్ని పంచుకోవడం కాదు, తనతో పాటు తన స్నేహితులు కూడా గొప్పగా రాణించాలని కోరుకోవడం. ఈ విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు. కష్టసుఖాల్లో తనతో నడిచిన స్నేహితుల్ని తనతోపాటే ముందుకు తీసుకెళ్తూ.. బన్నీ నిజమైన హీరో అనిపించుకున్నారంటూ ఈ విషయంపై అంతా హర్షం వెలిబుచ్చుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

