సెమీస్‌కు టీమిండియా.. క్వార్టర్స్‌లో జపాన్‌పై ఏకపక్ష విజయం
ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు తొలిపోరులోనే అదరగొట్టింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్లో టీమిండియా.. 8 వికెట్ల తేడాతో జసాన్ను చిత్తుచేసింది.
నిస్హిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు తొలిపోరులోనే అదరగొట్టింది. శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్లో టీమిండియా.. 8 వికెట్ల తేడాతో జసాన్ను చిత్తుచేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు.. తెలుగమ్మాయి శ్రీచరణి (4/10), షెఫాలి వర్మ (2/13) దెబ్బకు 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు స్టాఫర్డ్ (25), హరున ఇవాసకి (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
మిగతా 9 మందిలో నలుగురు డకౌట్ కాగా మిగిలిన ఐదుగురు కలిపి 15 రన్స్ మాత్రమే చేయగలిగారు. బంతితో రాణించిన షెఫాలి బ్యాట్‌తో (15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్)నూ వీరవిహారం చేయడంతో లక్ష్యాన్ని భారత్ 5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 59 రన్స్ చేసింది. సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. ఈనెల 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

