ముంబై : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘం, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డులకు ఫిర్యాదు చేశారు. అభిజీత్ దీప్కే అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయాలని అమిత్ కోరారు.
అభిజీత్ తండ్రి భగవాన్ రావ్ దీప్కే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసేవారని.. నెలకు రూ.60వేల నుంచి రూ.65వేలు మాత్రమే వస్తాయని అమిత్ చెప్పారు. అంత జీతంతో పిల్లలను ఆయన అమెరికాలో ఎలా చదివిస్తున్నారో సంబంధిత అధికారులు దర్యాప్తు చేయాలన్నారు. సీజేపీ రిజిస్టర్ కాని పొలిటికల్ పార్టీగా పనిచేస్తున్నదని.. నిధులు సమీకరిస్తున్నది ఆరోపించారు. సీజేపీ సేకరించే నిధులను అధికారికంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ డిమాండ్ చేశారు.