ఇందిరమ్మ ఇల్లు రాలేదని.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న బాధితుడు
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి గ్రామపంచాయతీ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. అర్హులకు కాదని సర్పంచ్‌కు ఇల్లు మంజూరు కావడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద టెంట్ వేసుకొని నిరసనకు దిగారు.
జనగామ రూరల్, సెప్టెంబర్ 28 : ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి గ్రామపంచాయతీ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటుచేసుకున్నది. అర్హులకు కాదని సర్పంచ్‌కు ఇల్లు మంజూరు కావడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద టెంట్ వేసుకొని నిరసనకు దిగారు. గ్రామంలోని వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ఎంపీ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వారి కోటాలో ఇండ్లు మంజురైనట్టు ఇటీవల ప్రచారం జరిగింది.
అందులో పేర్లు సహా జాబితా రావడంతో గతంలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న బిర్రు రాజు పేరు అందులో లేదు. సర్పంచ్‌కు ఇందిరమ్మ ఇల్లు రావడం తమలాంటి పేదలకు రాలేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బిర్రు రాజు తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకున్నాడు. గ్రామస్తులు అతన్ని అడ్డుకొని బాటిల్‌ను తీసుకొని పక్కన పడేశారు. తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు ఇండ్లు కేటాయించాలని కోరాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

