Rajya Sabha: 37 రాజ్యసభ సీట్ల కోసం మార్చి 16న ఎన్నికలు
Rajya Sabha: ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లోని సుమారు 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఖాళీ కాబోతున్న రాజ్యసభ(Rajya Sabha) సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నది. తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనున్నది. ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఆ ఏడు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఒడిశాలో నలుగురు , తమిళనాడులో ఆరుగురు, బెంగాల్లో అయిదుగురు, అస్సాంలో ముగ్గురు , బీహార్‌లో అయిదుగురు, చత్తీస్ఘడ్, హర్యానాల్లో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరి సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. 37 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారని, వారి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇవాళ తన మీడియా ప్రకటనలో పేర్కొన్నది. ఎన్నికల షెడ్యూల్‌కు చెందిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 9వ వరకు దరఖాస్తులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
The Election Commission of India has announced biennial elections to the Council of States (Rajya Sabha) to fill 37 seats from 10 states.
Date of polls- 16 March 2026.
Counting of votes will take place on the same day as polling. pic.twitter.com/gv8njEFbgP— ANI (@ANI) February 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

