KCR Birthday | తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. జొహెన్నస్బర్గ్లో గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో స్థానిక బీఆర్ఎస్ అనుబంధ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అభిమానులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టి అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాగరాజు గుర్రాల, నరేందర్ రెడ్డి మదస్సాని, హరీష్ రంగా, చక్రపాణి ధర్శనం, సాయి కిరణ్ నల్ల, సౌజన్ రావు నీలగిరి, సౌజన్ రావు, రాంబాబు తొడుపునూరి, కిరణ్ కుమార్ బెల్లి, అరవింద్ చీకోటి, నామ రాజేష్, వెంకట్ రావు తల్లపల్లి, రంజిత్ కుమార్, మొల్లాల బాలకృష్ణ రెడ్డి, కటిపల్లి సంజీవ్, రాజయ్య చికోటి, శశికళ చికోటి, సాయి కిరణ్ వేముల తదితరులు పాల్గొన్నారు.