MLA Kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 20 : వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ బహిరంగ సభను చీమల దండులా తరలి వొచ్చి విజయవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్లోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగమన్నారు. అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే హామీలను తుంగలో తొక్కి ఆరు గ్యారెంటీలను విస్మరించిందన్నారు. 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు పండుగలా నిర్వహించుకుందామని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఉద్యమాల గడ్డ, బీఆర్ఎస్ అడ్డా దుబ్బాక నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో బహిరంగ సభకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన రజతోత్సవ వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరుగెత్తే విధంగా నిర్వహించబోతున్నామన్నారు. ఊరూవాడల నుంచి ఉప్పెనలా గులాబీ దండు కదిలివొచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పీటీసీ యాదగిరి, మాజీ కో ఆప్షన్ పర్వేజ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకట్ గౌడ్. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకట్ బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి, జిల్లా నాయకులు ఇప్ప దయాకర్, కల్లూరి శ్రీనివాస్, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్