Koheda Road Accident | కోహెడ, మే 31 : కోహెడ మండలం బస్వాపూర్‌లో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు శనివారం రాష్ట్ర మాజీ మ్రంతి ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి ఆర్థిక సహాయం అందించారు. వివరాల్లోకి వెళితే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ రోజు బస్వాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
బహిరంగ సభకు వచ్చి తిరిగి వెళ్తున్న కమ్మరి గణేష్, తాలం సారయ్య అనే ఇద్దరు వ్యక్తులను సభకు వచ్చిన తూఫాన్ వాహనం ఢీ కొనగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బాధిత మృతుల కుటుంబాల సభ్యులకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పార్టీ తరఫున అందజేశారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత దురదృష్ఠకరమని వారు మృతుల కుటుంబ సభ్యులతో అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, సిద్దిపేట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, హుస్నాబాద్ నాయకుడు తిరుపతిరెడ్డి, కోహెడ నాయకులు ఆవుల మహేందర్, కొక్కుల రమేష్,కోహెడ మాజీ వైస్ చైర్మన్ తడకల రాజిరెడ్డి, పోలవేని కుమారస్వామి, తోట ఆంజనేయులు, ఆవుల మహేందర్, మాజీ ఎంపీపీ తిప్పారపు శ్రీకాంత్, పిల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత