MLA Palla Rajeshwar Reddy | చేర్యాల, జూన్ 15 : ఎర్రవల్లి వ్యవసాయ క్ష్రేతంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలికి గాయాలవగా.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం నియోజకవర్గ ప్రజలకు యశోద దవాఖాన నుంచి ఒక వీడియో విడుదల చేశారు.
నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం..మీ అందరి దీవెనెలు, ప్రార్ధనలతో కోలుకుంటున్న..త్వరలో మీ అందరిని త్వరలో కలుస్తా…అనుకోకుండా ఈ నెల 11న బాత్రూమ్లో జారిపడిన ఘటనలో దవాఖానలో చేరడం జరిగింది. వైద్యులు తనకు మేజర్ సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో మొదటి గంట తర్వాత తాను గట్టెక్కినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు రెస్ట్ తీసుకోవాలన్నారు, సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సర్జరీ కావడం వల్ల తాను కూర్చొవడం, నిల్చునే వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, బంధుమిత్రులు, అభిమానులు ఇక్కడి వచ్చారని కాని వారిని కలువలేకపోయినట్లు ఎమ్మెల్యే పల్లా తెలిపారు. త్వరగా తాను కోలుకుని మీ కష్టనష్టాలలో పాలుపంచుకుంటానని.. మీరు కొన్ని రోజులపాటు ఓపికతో ఉండాలని, ఇక్కడ పరిస్ధితులను మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నన్నారు. మీరు నాకోసం పడుతున్న బాధ, చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలకు తాను అన్ని విధాలుగా ధన్యుడను అన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం