Buffalo | తొగుట, ఆగస్టు 13 : మైసమ్మ దేవత పేరు మీద విడిచిన దున్నపోతుల మూలంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైసమ్మ పోతు దాడిలో గాయపడ్డ లింగపూర్కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు జీడిపల్లి యాదగిరిని రాంరెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. గత రెండు మాసాలుగా మైసమ్మ పోతుల దాడి మూలంగా చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు.
ఇటీవల మంతూర్కు చెందిన గొర్రె తిరుపతి రెడ్డికి, వెంకట్రావుపేట శేఖర్, కిష్టయ్య, యాదగిరి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. మైసమ్మ అమ్మవారి పేరున దున్నపోతులను విడిచి పెట్టిన వారు నేడు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో.. ఆ దున్నపోతులు తమవి కావని అంటున్నారని తెలిపారు. మంతూర్ గ్రామస్తులు ఒక దున్నపోతును పట్టుకొని కట్టేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా మొక్కు ఉన్నవారు పండుగ చేసుకోవాలని కోరారు.
దున్నపోతుల మూలంగా బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని, వాహనదారుల వెంట కూడా పడుతున్నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. దున్నపోతుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నందున వాటి స్థానంలో మేక పోతులను మొక్కుకోవాలని ఆయన కోరారు. బాధితుడిని పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తగరం అశోక్, నాయకులు బిక్కనూరి శ్రీశైలం, సంతోష్, బండారు స్వామిగౌడ్, జీడిపల్లి స్వామి, రాంబాబు తదితరులు ఉన్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు