Allu Arjun | పుష్ప 2 చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ నిజంగా నెక్స్ట్ లెవల్‌కు చేరిందనే చెప్పాలి. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్, యాక్షన్, ఎమోషన్ ప్రతి అంశంలోనూ తన పీక్ పెర్ఫార్మెన్స్ చూపించిన అల్లు అర్జున్, బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రకు గాను అల్లు అర్జున్ తాజాగా మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా ఈ గౌరవం అందుకోవడం ద్వారా ఆయన కెరీర్లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తయ్యాయి. యంగ్ హీరోల్లో ఇన్ని ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా బన్నీ టాప్‌లో నిలవడం విశేషం.
ఇక ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సంఖ్యలో మెగాస్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ సమానమయ్యాడు. చిరంజీవి తన కెరీర్లో 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోగా, ఇప్పుడు ‘పుష్ప 2’తో వచ్చిన ఈ అవార్డుతో బన్నీ కూడా అదే స్థాయికి చేరుకున్నారు. తక్కువ సినిమాలతో ఈ ఫీట్ సాధించడం విశేషమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డుతో కలుపుకొని 9 ఫిలిం ఫేర్ అవార్డులు ఉన్న హీరోగా నిలిచారు. కాగా, గతంలో ‘పరుగు’, ‘వేదం’, ‘రేసు గుర్రం’ (క్రిటిక్స్), ‘రుద్రమదేవి’ (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్), ‘సరైనోడు’, ‘పుష్ప: ది రైజ్’ సినిమాలకు గాను ఫిలిం ఫేర్స్ అందుకున్నారు అల్లు అర్జున్.
సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ‘పుష్ప 2’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్, అవార్డుల పరంగా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)
బెస్ట్ డెబ్యూ ఫిమేల్ – నయన్ సారిక (గం గం గణేశ)
బెస్ట్ డెబ్యూ మేల్ – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – దేవర: పార్ట్ 1)
బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ ( కుర్చీ మడతపెట్టి – గుంటూరు కారం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)