Naresh- Pavitra | పవిత్ర- నరేష్ రిలేషన్‌షిప్‌పై సంచలన కామెంట్స్ చేసిన విజయకృష్ణ.. ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్
Naresh- Pavitra | సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ బంధం గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ గురించి విజయ్ కృష్ణ ఎంతో సానుకూలంగా మాట్లాడారు.
Naresh- Pavitra | సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ బంధం గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ గురించి విజయ్ కృష్ణ ఎంతో సానుకూలంగా మాట్లాడారు. ఆమె అందరితో చాలా త్వరగా కలిసిపోతారు. నాతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటారు. మా నాన్న ఆమె ముందు కొంచెం సైలెంట్‌గా ఉంటారు. నిజం చెప్పాలంటే, 56 ఏళ్ల వయసులో కూడా నాన్న ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండటానికి కారణం పవిత్రే అని వెల్లడించారు.
పవిత్ర రాకతో ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, తండ్రి సంతోషంగా ఉండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నరేష్ – పవిత్రల బంధాన్ని కుటుంబ పెద్దలు అంగీకరించారా? అనే ప్రశ్నకు విజయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “అవును, మా తాతగారు కృష్ణ, నానమ్మకు నాన్న తీసుకునే ఏ నిర్ణయమైనా ఇష్టమే. ఆయన చెప్పిన విషయాన్ని వారు ఎప్పుడూ అంగీకరించేవారు” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఈ బంధంపై ఉన్న అనుమానాలకు తెరపడినట్టే అయింది. కుటుంబ సభ్యులందరూ నరేష్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తున్నారని విజయ్ మాటల్లో స్పష్టమైంది.
తన తండ్రి గురించి మాట్లాడిన విజయ్ కృష్ణ, నాన్న చాలా మల్టీ టాలెంటెడ్. ఒకేసారి ఎన్నో పనులు పూర్తి చేయగలరు. ముఖ్యంగా ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ తన పని పూర్తి చేసే విధానం నాకు చాలా ఇష్టం. నేను కూడా అది నేర్చుకోవాలని అనుకుంటా… కానీ నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని అని చెప్పారు.నరేష్ పని పట్ల ఉన్న అంకితభావం ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తుందని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని విజయ్ వెల్లడించారు. బయట ఎన్ని విమర్శలు వచ్చినా, సొంత కుటుంబం , ముఖ్యంగా కుమారుడు విజయ్ కృష్ణ ఈ బంధంపై ఇంత పాజిటివ్‌గా స్పందించడం విశేషం. తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

