హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీజీ జెనో) డైరెక్టర్ (సివిల్) అజయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం వెల్లడించారు.
ఆయన రాసిన లేఖలో వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ ఉద్యోగం నుంచి వైదొలగుతున్నట్టు పేరొన్నారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.