రేవంత్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు తగ్గిపోయిందని, గ్రామ పంచాయతీల సగటు వ్యయం దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు.
- తగ్గిన నిధులు.. పడిపోయిన పంచాయతీల సగటు వ్యయం
- ఆర్బీఐ నివేదికే నిదర్శనం
- మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు తగ్గిపోయిందని, గ్రామ పంచాయతీల సగటు వ్యయం దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 2023లో పంచాయతీల సగటు వ్యయం రూ.16 లక్షలు ఉండేదని, ప్రస్తుతం రూ.6 లక్షలకు పడిపోయిందని తెలిపారు.
తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రం త్రిపురలో పంచాయతీ సగటు వ్య యం రూ.20 లక్షలు దాటిందని పేర్కొన్నా రు. కేసీఆర్ పాలనలో సర్ప్లస్ బడ్జెట్‌తో ఉన్న పల్లెసీమలు ఇప్పుడు లోటు బడ్జెట్లోకి వెళ్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నుంచి నిధులు రావడం లేదని స్పష్టంచేశారు. మార్చిలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక లు పెట్టకపోతే మరో రూ.500 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోతాయి. మూడేండ్లలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. గ్రామాలను నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ జపం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

