కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు.