పంచాయతీ నిధుల మళ్లింపు అవాస్తవం
కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు.
- ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదు
- విక్రేతలకే నేరుగా బిల్లులు చెల్లించాం
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హనుమంతరావు
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పెండింగ్ బిల్లులను వేగంగా చెల్లించడానికి పీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా నేరుగా విక్రేతలకు విడుదల చేస్తారని వివరించారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించారనేది వాస్తవం కాదని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, ఖర్చులపై మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదల చేస్తామన్నారని, ఈ నేపథ్యంలో ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్టు వివరించారు.
నిధులు విడుదల చేస్తున్న రాష్ట్రం
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంలో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించిందని, వీటిని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నామని హనుమంతరావు తెలిపారు. ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ఆర్థిక సంఘం వాటా, వాటితో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా కలిపి విడుదల చేస్తున్నదని వివరించారు. కేంద్రం సైతం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నదని, నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్ల్లో జమ చేయదని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్‌టైడ్ కాంపొనెంట్ అనే రెండు రకాలుగా వెచ్చించాల్సి ఉంటుందని, టైడ్ కాంపొనెంట్‌ను పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించవచ్చని నిబంధనలు చెప్తున్నాయని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీకి అధికారం ఉన్న ఏ ఉద్దేశానికైనా అన్‌టైడ్ గ్రాంట్‌ను ఉపయోగించవచ్చని స్పష్టంచేశారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడానికి ముందు గ్రామ పంచాయతీలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట ఖర్చులను రికార్డు చేశాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

