Rahul Chahar | టీనేజ్లోనే ప్రేమ.. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. పెద్దతప్పు చేశానంటున్న యువ స్పిన్నర్..!
Rahul Chahar : ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు తమ ఆటతోనే కాకుండా విడాకులతోనూ నెట్టింట వైరలవుతున్నారు. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న చాహర్.. నాలుగో వార్షికోత్సవానికి ముందే విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
Rahul Chahar : ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు తమ ఆటతోనే కాకుండా విడాకులతోనూ నెట్టింట వైరలవుతున్నారు. రెండేండ్ల క్రితం హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఈమధ్యే యజ్వేంద్ర చాహల్ (Yazvendra Chahal) డైవొర్స్తో వార్తల్లో నిలువగా.. ఇప్పుడు యువ ఆటగాడు రాహుల్ చాహర్ (Rahul Chahar) సైతం ఇదే దారి ఎంచుకున్నాడు. 22 ఏళ్లకే చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న చాహర్.. నాలుగో వార్షికోత్సవానికి ముందే విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాడు. భార్యతో విడిపోవాలనే నిర్ణయానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నాడీ మిస్టరీ స్పిన్నర్.
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన దీపక్ చాహర్ సోదరుడే రాహుల్ చాహర్. భారత జట్టుకు సైతం ఆడిన అతడిది ప్రేమ వివాహం. టీనేజ్లోనే తన చిన్ననాటి స్నేహితురాలు ఇషానీ జోహర్ (Ishani Johar)తో చాహర్ ప్రేమలో పడ్డాడు. ఇరుకుటుంబాల అంగీకారంతో 2019లోనే అంటే.. 19 ఏళ్లకే వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే.. కరోనా కారణంగా మూడేళ్లకు చాహర్, ఇషానీ పెళ్లి చేసుకున్నారు. గోవాలో మార్చి 9న మనువాడే సమయానికి ఇద్దరి వయసు 22 మాత్రమే. అయితే.. ఏమైందో తెలియదు నాకు విడాకులు కావాలంటూ కోర్టు చుట్టూ తిరిగాడు. ఎట్టకేలకు చాహర్ ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తాను స్వేచ్ఛ పొందానని చెబుతున్నాడీ యువ క్రికెటర్.
Finally pic.twitter.com/KhZKlX8obj
— Rahul Chahar (@rdchahar1) February 20, 2026
‘చిన్న వయసులోనే నేను వైవాహిక జీవితంలో అడుగుపెట్టాను. నన్ను నేను పూర్తిగా అర్ధం చేసుకోకముందే, నా విలువేంటో తెలుసుకోకముందే.. నేను కలలు కన్న జీవితాన్ని నిజం చేసుకోవడానికి ముందే పెళ్లి చేసుకున్నా. అందుకు ప్రతిఫలంగా నేను ఊహించని కొన్ని పాఠాలు నేర్చుకున్నా. గత 15 నెలలైతే నరకంగా తోచాయి. తరచూ కోర్టు మెట్లు ఎక్కిదిగాను. ఈ సమయంలోనే ఓపికగా, ప్రశాంతంగా ఉండడం.. మనోధైర్యం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నా. ఈ రోజు నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. న్యాయపరమైన లాంఛనాలు పూర్తికావడంతో విడాకులు వచ్చాయి.
Ishani Johar’s failed love story….!!
Ishani Johar herself disappeared from the public eye after she embarrassed cricketer Rahul Chahar by divorcing him.
When her own engine had completely failed.#IshaniJohar #RahulChahar #FaileLoveStory pic.twitter.com/iemyL6MNq1
— Nila Goswami (@Nila_Goswami) February 21, 2026
అయితే.. నేను తీసుకున్న పెళ్లి నిర్ణయం నాకు ఎంతో నష్టం చేకూర్చింది. కోపంతోనో, పశ్చాత్తాపంతోనో నేను విడాకులు తీసుకోవడం లేదు. చాలా స్పష్టతతో ఈ నిర్ణయం తీసుకున్నా. కొన్ని బంధాలు కలకాలం కొనసాగవు. అవి మనల్ని మేల్కోలుపుతాయి. మనకు పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మార్చేస్తాయి. నేను తెలివిగా ముందడుగు వేశాను. నాపట్ల మరింత అవగాహనతో.. నాకు నచ్చిన జీవితాన్ని గడపాలనుకుంటున్నా’ అని చాహర్ ఫ్యాషన్ డిజైనరైన ఇషానీతో విడాకులకు దారి తీసిన పరిస్థితులను పేర్కొన్నాడు.
Rahul chahar wedding #RahulChahar pic.twitter.com/karY1OnNPO
— Punjab Kesari- Sports (@SportsKesari) March 9, 2022
2021లో అరంగేట్రం
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన రాహుల్ చాహర్ మిస్టరీ లెగ్ స్పిన్నర్‌గా 2021లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఏడు మ్యాచులకే పరిమితయ్యాడు. కానీ, ఐపీఎల్లో మాత్రం పలు జట్లకు ఆడాడీ యంగ్‌స్టర్. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జెర్సీలతో మెరిసిన చాహర్‌ను పంతొమ్మిదో సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.20 కోట్లకు కొన్నది.
Welcome to the den Rahul Chahar ✨💛
You wanted to play for CSK & your dream came true, Expecting some magical spells at Chepauk!! pic.twitter.com/UZmvxxhe8C
— Navneet 🚩 (@MSDian067) December 16, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

