Leopard | రాయపోల్, ఆగస్టు 24 : గత నెల రోజుల కిందట సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి, అల్మాస్ పూర్ శివార్లో మూడుసార్లు కలకలం రేపిన చిరుత పులి తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. చిరుత పులి సంచరించిందని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన సంతోష్, కొండాపూర్ గ్రామానికి చెందిన సంజీవులు చిరుత పులి అరుపులు వినిపించాయని దొమ్మాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మధులతకు ఫిర్యాదు చేశారు. చిరుత సమాచారం అందుకున్న మిరుదొడ్డి సెక్షన్ ఆఫీసర్ మల్లేశం, బీట్ ఆఫీసర్ మధులతలు చిరుత సంచరించిన స్థలాన్ని పరిశీలించి.. చిరుత పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు వాటిని చిరుత అడుగులేనని ధ్రువీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచరించిన పాదముద్రల ప్రకారం చిరుత కొండాపూర్ శివారు నుంచి ఉప్పరపల్లి, అల్మాస్ పూర్ లింగం చెరువు మీదుగా దొమ్మాట అడవిలోకి వచ్చిందన్నారు. చిరుత పులి దొమ్మాట అడవిలోనే ఉన్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని ఉదయం బోరు బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రజలు గుంపులుగా చేతిలో కర్ర పట్టుకుని వెళ్లాలని తెలిపారు. పొలాల వద్ద పశువులను ఉంచకుండా, ఇండ్ల వద్దకు తెచ్చుకోవాలని రైతులకు తెలిపారు. గొర్రెల మేకల పెంపకం దారులు ఎవరు అడవిలోకి రావద్దని సూచించారు.
అడవిలో సీసీ కెమెరాలు..
చిరుత జాడ కోసం దొమ్మాట అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు ఫారెస్ట్ అధికారులు . దొమ్మాట, గాజులపల్లి ,అల్మాస్ పూర్, ఉప్పరపల్లి ,లింగరాజు పల్లి, కోనాయిపల్లి ,కొండాపూర్ గ్రామాల ప్రజలకు ఎవరికైనా చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలను కోరారు. కాగా ఆదివారం సాయంత్రం వరకు కూడా చిరుత పులి జాడ దొరకలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. చిరుత జాడ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?