Indiramma Atmiya Bharosa Scheme | గజ్వేల్, మే 20 : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేసి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందించాలని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా కార్యదర్శి వేణు డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పథకం అమలు సాకుతో నిలిపివేసిన ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల జారీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
జాబ్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, పనుల వద్ద కూలీలైన హక్కుదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు పేరుతో ఉపాధి హామీ చట్టానికి విరుద్దంగా జాబ్ కార్డులలో పేర్లు నమోదు చేయడం, కొత్త కార్డుల జారీని నిలిపివేయడమంటే చట్టాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్నట్లే అన్నారు.
పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, రద్దుచేసిన వేసవి అలవెన్స్‌లను తిరిగి చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు నారాయణ, అరుణ్‌లు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ