CPM leader Shivaraju | హుస్నాబాద్‌టౌన్, జూన్ 1: ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ పథకంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత కల్పిస్తే ఊరుకునేదిలేదని సీపీఎం నియోజకవర్గ నాయకుడు గుగులోతు శివరాజు హెచ్చరించారు. హుస్నాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోనే ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రకటించారని ఆయన ఆరోపించారు.
పేదలకు పథకాలను అందకుండా చేయడమే ప్రభుత్వ విధానమా..? అని శివరాజు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాజీవ్ యువవికాస్ పథకంలో సైతం నిరుద్యోగులకు చోటు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు సూచించిన పేర్లతోనే జాబితాను రూపొందిస్తున్నారని శివరాజు ఆరోపించారు.
ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని లేని పక్షంలో పేదలతో కలిసి ఆందోళనకు దిగుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు గుగులోతు రాజునాయక్, భూక్యా భాస్కర్, జి రాజు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!