Harish rao | సిద్దిపేట, జనవరి 26 : కేసీఆర్ సీఎం అయ్యాక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు సిద్దిపేట రూరల్ మండలం చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణి కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. .. కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని అన్నారు. బాలికలకు 50శాతం బీసీ గురుకులాలు ప్రారంభం చేసింది కేసీఆర్.. అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్కు అప్ గ్రేడ్ చేశారని చెప్పారు. కేసీఆర్ 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తెచ్చారని వెల్లడించారు.
బాగా చదవండి మంచి ఉత్తిర్ణత సాధించండి. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందినవారికి సొంతంగా ఐ ప్యాడ్ కొనిస్తానని విద్యార్థులకు హరీశ్ రావు హామీనిచ్చారు. జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారు. బైపిసీ విద్యార్థులు బాగా చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు పొందితే మీ పిజూలు నేను చెల్లిస్తా. సీటు మీది… ఫీజు నాది. వచ్చే ఏడాదిలో సిద్దిపేట మెడికల్ కాలేజీ సీట్లను 280 మెడికల్ సీట్లకు పెంచుతామన్నారు.
Proteins Makthal | జాతీయ జెండావిష్కరణలో అపశృతి.. ఒకరికి గాయాలు, మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం : వీడియో
ప్రోటీన్లు కావాలంటే నాన్ వెజ్ తినాల్సిన పనిలేదు.. వీటిని కూడా తినవచ్చు..!