Garbage Free Town | హుస్నాబాద్ టౌన్, జూన్ 16 : హుస్నాబాద్ పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ కోరారు. హుస్నాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మంచినీటి ట్యాంకును కమిషనర్‌తోపాటు పలువురు సిబ్బంది సోమవారం క్లోరినేషన్ చేసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ ప్రజలతో మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు మున్సిపల్ సిబ్బందితో సహకరించాలని కోరారు. ఇండ్లలో తడి, పొడి, హానికరమైన చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తడి చెత్తను ఇళ్లలోనే సేంద్రియ ఎరువుగా మార్చుకొని మొక్కలకు వేయాలని.. తద్వారా చెత్త ఉత్పత్తి తగ్గిపోతుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కమిషనర్ మల్లికార్జున గౌడ్ సూచించారు.
చెత్తను మురికి కాలువలలో కానీ.. చుట్టుపక్కల గానీ వేయకుండా మున్సిపల్ వాహనాలకే ఇవ్వడం వల్ల పట్టణం పరిశుభ్రంగా ఉంటుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కమిషనర్ మల్లికార్జున గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సంపత్ రావు, టీఓ రోహిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల్ ఎల్లం, పర్యావరణ అధికారి డి. రవికుమార్‌తో పాటు పలువురు వార్డు అధికారులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత