Drum Seeder | తొగుట, జూలై 30 : వర్షాలు ఆలస్యం అవడం వరి నారు పోసుకోవడానికి అనుకూలంగా లేకపోవడం.. అంతే కాకుండా అందరూ ఒకేసారి నాటు వేసుకోవడంతో సరైన సమయానికి కూలీలు దొరకగా నాటు వేయడం ఆలస్యం అవుతుంది. ఒక ఎకరం నాటు వేయడానికి సుమారు ఐదు వేల రూపాయల ఖర్చవుతుంది. ఈ సమస్యను నేరుగా విత్తుకునే విధానం ద్వారా పరిష్కరించవచ్చునని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అన్నారు.
బుధవారం పెద్ద మాసాన్ పల్లి గ్రామం రైతు పన్యాల సుదర్శన్ రెడ్డి పొలంలో వరి నేరుగా విత్తుకునే పద్ధతిలో మెరుగైన పద్దతి డ్రమ్ సీడర్పై ఏఈఓ నాగార్జున అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో సాగు చేయడం ద్వారా సరైన సమయానికి విత్తనం విత్తుకోవడంతోపాటు ఎకరానికి 7 కిలోల విత్తనం మాత్రమే అవసరం ఉంటుంది, డ్రమ్ సీడర్తో సాగు చేయడం వల్ల కలుపు తీయడానికి కూలీల అవసరం లేకుండా కోనో వీడర్ పరికరం సహాయంతో సులువుగా తీసుకోడం జరిగింది.
ఎకరానికి 8000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులు సరైన సమయానికి కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందుతారని తెలిపారు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు