House Collapse | రాయపోల్, సెప్టెంబర్ 13 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మండల కేంద్రం రాయపోల్ గ్రామానికి చెందిన తుమ్మ రాణి ఇల్లు శనివారం కూలిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పైకప్పు కూలడంతో ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధలో తుమ్మ రాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను స్థానికులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిoచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!