Chalo Delhi | రాయపోల్, నవంబర్ 01 : రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న హలో మాల-చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల- చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు. మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ ,రాజ్యాంగ విరుద్ధంగా జీవో 99 రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని పేర్కొన్నారు. అలాగే దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41 సీఆర్పీ సెక్షన్ ద్వారా నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకుండా పోతుందని, వెంటనే 41 సీఆర్పీ సెక్షన్ రద్దు చేయాలన్నారు. ఇలాంటి 12 అంశాలతో కూడిన డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ కాల్వ నరేష్, సిద్దిపేట జిల్లా మాల మహానాడు నాయకులు మండల యాదగిరి, పుట్ట రాజు,రాయపోల్ మండల అధ్యక్షులు సొక్కం స్వామి, నాయకులు కనకస్వామి, బొల్లం రాజేష్, రాంపల్లి స్వామి, తూర్పు శ్రావణ్, సొక్కం సుధాకర్,పుట్ట కరుణాకర్,రాంపల్లి లింగం,మన్నే సన్నీ,బ్యాగరి నవీన్, బాలకృష్ణ, విష్ణు, అజయ్, భారత్,రాజు, విక్రమ్, బైండ్ల నరేష్,గొల్లపల్లి ప్రేమ్ కుమార్, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్‌గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!