Gurukul School | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.
వివేక్ తండ్రి ఉదయాన్నే తన కుమారుడిని స్వగ్రామం నాగునూరు నుండి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. కొద్దిసేపటికే వివేక్ వాళ్ల సార్ ఫోన్ చేయడంతో అతని తండ్రి స్కూల్‌కు తిరిగివెళ్లాడు. కానీ అప్పటికే వివేక్ చనిపోయాడు. అయితే ఏం జరిగిందని అడిగితే వివేక్ కారిడార్‌లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకుని చనిపోయాడని ఉపాధ్యాయులు చెప్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘పొద్దున 9: 30గంటలకు నా కొడుకును స్కూల్లో దింపి పోయిన సార్. ఇవాళ 11 గంటలకు వాళ్ల సార్ ఫోన్ చేశాడు. మీ కొడుకు తాడు చుట్టుకొని కింద పడ్డాడు అంటే వెంటనే ఇక్కడికొచ్చిన. నేను వచ్చేసరికి ఏం జరిగిందనేది మాత్రం వాళ్లు స్పష్టంగా చెప్పడం లేదంటూ ’ మృతుడు వివేక్ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ