Inter cropping | తొగుట, ఆగస్టు 25 : రైతు స్థాయిలో నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి తోటి రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులో ఉండేందుకు వ్యవసాయ శాఖ విత్తన ఉత్పత్తి పైన రైతులకు అవగాహన కల్పిస్తోంది. పెద్ద మాసాన్ పల్లి గ్రామం పన్యాల నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా పెసర విత్తన ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటలో మొక్కకు, మొక్కకు మధ్య దూరం 9 మీటర్లు ఉంటుంది. అంతర పంట సాగు చేయడానికి అనుకూలంగా ఉండడం, చుట్టుపక్కల వేరే పెసర పంట లేకపోవడం, ఒక రకానికి మరో రకానికి మధ్య సరిపడ దూరం ఉండడంతో విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందన్నారు.
స్వల్పకాలిక పంట పెసర విత్తన ఉత్పత్తి చేయడం జరిగిందని.. పెసర సూటి రకం ఎంజీజీ 385 ఒక ఎకరం పొలంలో సాగు చేయడం జరిగిందన్నారు. ఈ రకం పల్లాకుల తెగుళ్లను తట్టుకుంటుంది. ఈ పంట ద్వారా తక్కువ సమయంలో రైతులు మంచి ఆదాయాన్ని పొందుతారని నాగార్జున తెలిపారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు