Farmers | కొమురవెల్లి, జూన్ 9 : కొమురవెల్లి మండలంలోని రసూలాబాద్లో సర్వే నెంబర్ 257లోని భూధాన్ భూమిలో మోకాపై ఉన్న రైతులందరికి పట్టాలివ్వాలని మాజీ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ అన్నారు. సోమవారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వే నెంబర్ 257లోని భూధాన్ భూమిలో మోకాపై ఉన్న రైతులందరికి పట్టాలివ్వాలని కోరుతూ తహసీల్దార్ దివ్యకు మాజీ సర్పంచ్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..