Garima Agarwal | దౌల్తాబాద్, అక్టోబర్ 14: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూరిబా పాఠశాలను సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి రోజు ఎంతమంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత మంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినిత్యం ఓపీలను తక్కువ చేసి రికార్డుల్లో ఎక్కువ చూపిస్తున్నారని గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా తక్షణమే వైద్య సేవలపై దృష్టి పెట్టాలని వైద్యాధికారులకు సూచించారు. కస్తూరిబా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం కూరగాయలు పెట్టడం లేదని ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం దొమ్మాట ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న అపరిశుభ్రమైన చెత్తాచెదారాన్ని చూసి ఇన్చార్జ్ ఎంపీడీవో గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి బిక్షపతిపై మండిపడ్డారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లింగరాజు పల్లి, దొమ్మాట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి లింగస్వామి, తహసిల్దార్ చంద్రశేఖర రావు, మండల విద్యాధికారి కనకరాజు, ఇన్చార్జ్ ఎంపీడీవో సయ్యద్ గపూర్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య