రామగిరి, ఫిబ్రవరి 25: బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదని నల్సార్ యూనివర్సిటీ వీసీ ప్రొ. శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. నల్లగొండలోని ఎంజీయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల డిపార్టుమెంట్ ఆఫ్ సోషల్ వర్క్, సెంటర్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ జిస్టిస్ విభాగం, నల్సార్ యూనివర్సిటీ సంయుక్తంగా ఎంజీయూలో బుధవారం నిర్వహించిన ‘నల్లగొండ జిల్లాలోని బాలల స్థితిగతులపై చేపట్టనున్న అధ్యయనం’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా, పర్యావరణ మార్పు, బాలలపై ప్రభావం, వివిధ చట్టాల అమలు తీరును ఎంజీయూ విద్యార్థులతో అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
సత్వర న్యాయం ప్రతి ఒక్కరి హక్కుగా భావించాలన్నారు. ఉన్నత విద్యాలయాలు నిరంతరం పరిశోధనలతో విధానపరమైన మార్పు చేర్పులకు చట్టాల అమలుకు దోహదపడాలని సూచించారు. ఎంజీయూ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడాతూ సమాజ పురోగతికి సామాజిక శాస్త్రాల అధ్యయనం అవసరమన్నారు. కార్యక్రమంలోఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. అంజిరెడ్డి, నల్లగొండ సీడబ్యుసీ చైర్మన్ చింత కృష్ణ, ఐసీపీఎస్ అధికారి గణేష్, లేబర్ అధికారి రాజు, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ బాధ్యులు నాగరాజు, ఎంజీయూ సోషల్ వర్క్ విభాగం హెచ్‌వోడీ లక్ష్మల మధు, అధ్యాపకులు శ్రవణ్‌కుమార్, నవీన్‌కుమార్, నాగార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.